Skip to main content

Nainital: ‘నైనిటాల్‌’లో పెరిగిన రెడ్ పాండా జనాభా

ఉత్తరాఖండ్‌లో సరస్సుల నగరంగా నైనిటాల్‌ పేరొందింది.
Red Panda Liked Weather of Nainital Population Increased   Govind Vallabh Pant Zoo Park

స్థానిక గోవింద్ వల్లభ్ పంత్ జూ పార్కు.. రెడ్‌ పాండాల కేంద్రంగా మారింది. ఇక్కడి వాతావరణం రెడ్‌ పాండాలకు అనుకూలంగా ఉండటంతో వాటి జనాభా పెరిగింది.  
ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ పాండాల సంఖ్య దాదాపు 10 వేలకు తగ్గగా, దీనికి భిన్నంగా నైనిటాల్‌లో రెడ్‌ పాండాల జనాభా పెరిగింది. కాగా రెడ్ పాండాను అంతరించిపోతున్న జంతువుల విభాగంలో చేర్చారు. రెడ్‌ పాండాలను ప్రపంచంలోనే అందమైన జంతువులుగా అభివర్ణిస్తారు. రెడ్‌ పాండాలు ఎవరికీ ఎటువంటి హాని చేయవు. పూర్వ కాలంలో చాలామంది రెడ్‌ పాండాలను వేటాడేవారు. వాటి చర్మంతో టోపీలు తయారు చేసేవారు. నైనిటాల్ జంతుప్రదర్శనశాలకు వచ్చే సందర్శకులు రెడ్ పాండాలను చూస్తూ, గంటల కొద్దీ సమయం గడుపుతుంటారు. 

Zircon Hypersonic Weapon: గగనతల రారాజు ‘జిర్కాన్‌’.. దీని ప్రత్యేకతలు ఎన్నో!!

నైనిటాల్ జంతు ప్రదర్శనశాలకు చెందిన జీవశాస్త్రవేత్త అనూజ్ మాట్లాడుతూ 2014లో డార్జిలింగ్ జూ నుండి రెండు ఎర్ర పాండాలను ఇక్కడికి తీసుకువచ్చారని, ప్ర‌స్తుతం వాటి సంఖ్య ఏడుకి పెరిగిందన్నారు. రెడ్‌ పాండాలు ఎత్తయిన ప్రదేశాలలోని చెట్లపై నివసించడానికి ఇష్టపడతాయన్నారు. అవి రింగల్ గడ్డిని ఇష్టంగా తింటాయని తెలిపారు. 

నైనిటాల్‌ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడి పాండాలకు వాటి ఆహారంలో ఆపిల్, అరటిపండ్లు, తేనె, పాలు ఇస్తారని తెలిపారు. కాగా రెడ్ పాండా సోమరి జంతువని, ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటుందని అన్నారు. దీనిని జూపార్కులో ఉదయం, సాయంత్రం వేళల్లో చూడవచ్చన్నారు. 

Moon Landing: ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ ఘన విజయం.. చంద్రుడి ఒడిలో ‘ఒడిస్సియస్’!

Published date : 24 Feb 2024 04:47PM

Photo Stories