Global Innovation Summit: ఫార్మా రంగ ఆవిష్కరణల తొలి శిఖరాగ్ర సదస్సు
ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ నవంబర్ 18న ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్‌తో సహా వివిధ దేశాల ప్రముఖులు హాజరైన ఈ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ... భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని పేర్కొన్నారు.
సిడ్నీ డైలాగ్‌లో మోదీ ప్రసంగం..
‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో నవంబర్ 18న నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించారు. క్రిప్టోకరెన్సీ దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు.
చదవండి: అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’లో ఆన్‌లైన్ ద్వారా ప్రసంగం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు : వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రసంగించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్