Skip to main content

Smoking: అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశం?

Smoking

ప్రపంచదేశాల్లో పదహారు నుంచి 64 ఏళ్ల వయసు వారు అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశాల్లో చైనా తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో నిలిచాయి. ‘ది ఇంటర్నేషనల్‌ కమిషన్‌ టు రీఇగ్నైట్‌ ది ఫైట్‌ ఎగెనెస్ట్‌ స్మోకింగ్‌’ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచబ్యాంకు తదితర సంస్థల నుంచి సేకరించిన గణాంకాలను క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు.

నివేదిక ప్రకారం..

  • చైనా, భారత్‌లలో 16–64 ఏళ్ల వయసు వారిలో ఏకంగా 50 కోట్ల మందికిపైగా పొగాకు తాగే అలవాటు ఉంది.
  • భారత్‌లో 25 కోట్ల మందికి పొగరాయుళ్లు ఉన్నారు. అధికంగా పొగాకు వినియోగిస్తున్న 16–64 ఏళ్ల జనాభా విభాగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.
  • ఇండియాలో మహిళల కంటే పురుషుల్లో పొగాకు వాడకం మూడు రెట్లు ఎక్కువ
  • పొగ తాగే అలవాటును త్యజించాలని భావించే జనాభా భారత్‌లో తక్కువే.
  • భారత్‌ పొగతాగడాన్ని వదిలేయాలని 37 శాతం మంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
  • భారత్‌లో స్మోకింగ్‌ను వదిలేస్తున్న పురుషుల శాతం ఇంకా 20శాతం లోపే ఉంది
  • పొగాకు నమలడం ద్వారా వచ్చే నోటి క్యాన్సర్‌ వంటి ఘటనలు భారత్‌లోనూ భారీగానే నమోదవుతున్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా దాదాపు 114 కోట్ల మంది పొగాకుకు బానిసలుగా మారారు. దీంతో ఏటా 80 లక్షల మంది రోగాలబారిన పడి తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
  • పొగాకు కారణంగా ఆర్థిక, సామాజిక అసమానతలు తలెత్తి ప్రపంచంలో ఏటా దాదాపు 2 ట్రిలియన్‌ డాలర్ల ప్రజాధనం ఖర్చవుతోంది.

చ‌ద‌వండి: ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 16 నుంచి 64 ఏళ్ల వయసు వారు అత్యధికంగా పొగతాగుతున్న జనాభా గల దేశాల్లో చైనా తర్వాత రెండో స్థానంలో భారత్‌.
ఎప్పుడు : నవంబర్‌ 18
ఎవరు    : ది ఇంటర్నేషనల్‌ కమిషన్‌ టు రీఇగ్నైట్‌ ది ఫైట్‌ ఎగెనెస్ట్‌ స్మోకింగ్‌ సంస్థ
ఎక్కడ    : ప్రపంచ దేశాల్లో..

Published date : 19 Nov 2021 02:28PM

Photo Stories