AIIMS: ఎయిమ్స్–గువాహటి జాతికి అంకితం
అస్సాం రాజధాని గువాహటిలో రూ.1,123 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అలాగే నల్బారీ, నాంగావ్, కోక్రాజార్‌లో మెడికల్ కాలేజీలను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.546 కోట్లతో నిర్మించే అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇనిస్టిట్యూట్ (ఏఏహెచ్‌ఐఐ)కు పునాదిరాయి వేశారు. దీన్ని అస్సాం ప్రభుత్వం, ఐఐటీ–గువాహటి సంయుక్తంగా నిర్మించనున్నాయి. 1.1 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో నూతన ఆసుపత్రులు, వైద్య కళాశాలల రాకతో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కాబోతున్నాయన్నారు.
Ambedkar Statue: దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం.. 125 అడుగుల విగ్రహ రూపకర్త, విగ్రహ ప్రత్యేకతలివే..
రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రూ.7,300 కోట్లతో కూడిన ఐదు రైల్వే ప్రాజెక్టులను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. బ్రహ్మపుత్ర నదిపై రూ.3,200 కోట్లతో పలాస్‌బారీ–సువాల్‌కుచీ బ్రిడ్జి నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు. దిబ్రూగఢ్‌లో రూ.1,709 కోట్లతో నిర్మించిన మిథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అస్సాంలో సంప్రదాయ బిహూ నృత్యోత్సవంలో మోదీ పాల్గొన్నారు. 11,000 మందికిపైగా నృత్యకారులు, కళాకారులు అలరించారు. ఇక్కడ ఏప్రిల్ 13న నిర్వహించిన బిహూ నృత్యం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సృష్టించింది.
National Party: ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివే..
గౌహతి హైకోర్టు 70వ వార్షికోత్సవం
ఏప్రిల్ 14న అస్సాంలో గౌహతి హైకోర్టు 70వ వార్షికోత్సవ ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. న్యాయసేవలు అందించే వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాని సూచించారు. టెక్నాలజీతో సత్వర న్యాయం అందించవచ్చని, దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల వంటి మూరుమూల ప్రాంతాల ప్రజలకు ఎంతోమేలు రుగుతుందన్నారు.