Skip to main content

PM Modi: ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్‌ కారిడార్‌కు ఎక్కడ శంకుస్థాపన చేశారు?

Modi

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రూ.18వేల కోట్లకుపైగా విలువైన 11 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. డిసెంబర్‌ 4న డెహ్రాడూన్‌లోఈ శంకుస్థాపనల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా తాము మౌలికసదుపాయాల అనుసంధాన మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని, ఇందులో భాగంగానే 11 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రూ.2,573 కోట్లతో పూర్తయిన ఏడు ప్రాజెక్టులను ఆయన ఇదే కార్యక్రమంలో ప్రారంభించారు.

అతిపెద్ద వైల్డ్‌లైఫ్‌ కారిడార్‌..

  • ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో రూ.8,600 కోట్ల ఢిల్లీ–డెహ్రాడూన్‌ ఎకనమిక్‌ కారిడార్, ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్‌ కారిడార్, బాలలకు అనువైన సిటీ ప్రాజెక్ట్, రిషీకేశ్‌లో  కొత్త బ్రిడ్జి తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.
  • ఢిల్లీ–డెహ్రాడూన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(ఈస్టర్న్‌ పెరిఫెరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే జంక్షన్‌ నుంచి డెహ్రాడూన్‌ వరకు) పూర్తయితే ఢిల్లీ–డెహ్రాడూన్‌ మధ్య ప్రయాణదూరం 180 కి.మీ.లకు తగ్గనుంది. ఈ కారిడార్‌లో 12 కిలో మీటర్ల మేర ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్‌లైఫ్‌ కారిడార్‌ ఉండనుంది.

చ‌ద‌వండి: ఇన్సాకాగ్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    
: రూ.18వేల కోట్లకుపైగా విలువైన 11 మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్‌ 4
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : ఉత్తరాఖండ్‌ 
ఎందుకు : మౌలికసదుపాయాల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 06 Dec 2021 02:23PM

Photo Stories