Booster Dose: ఇన్సాకాగ్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు?
దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసు ఇవ్వొచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సార్స్–కోవ్–2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్ (ఇన్సాకాగ్) చెందిన శాస్త్రవేత్తల బృందం సిఫారసు చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు రంగాల్లో వ్యక్తులకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్‌లోని జన్యుక్రమాలను పరీక్షించడానికి ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వేరియెంట్ కేసులు దేశంలోకి ప్రవేశించాయన్న విషయాన్ని త్వరితగతిన తెలుసుకోవడం కష్టసాధ్యమని, అందుకే కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని చెప్పింది.
ఇన్సాకాగ్(INSACOG)ను విపులీకరించండి?
ఇండియన్ సార్స్–కోవ్–2 కన్సోర్టియమ్ ఆన్ జినోమిక్స్ లేదా ఇండియన్ సార్స్–కోవ్–2 జెనెటిక్స్ కన్సోర్టియమ్
దక్షిణాఫ్రికాకు డబ్ల్యూహెచ్‌వో బృందం
కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియెంట్‌తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) బృందం ఆ దేశానికి వెళ్లింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కి కేంద్రమైన గౌటాంగ్ ప్రావిన్స్‌లో కేసుల్ని పర్యవేక్షించడానికి డబ్ల్యూహెచ్‌ఒ తన బృందాన్ని పంపించింది. ఈ విషయాలను డబ్ల్యూహెచ్‌వో రీజనల్ డైరెక్టర్ ఫర్ ఆఫ్రికా డాక్టర్ సలామ్ గూయె తెలిపారు.
చదవండి: ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ఎక్కడ పని చేయనుంది?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్