Aircraft Carrier: ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ఎక్కడ పని చేయనుంది?
స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిలో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ బేస్, సీ ట్రయల్స్ పూర్తయ్యాయని తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా వెల్లడించారు. త్వరలోనే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో ఇది పని చేస్తుందని తెలిపారు. నేవీ డే(డిసెంబర్ 4) సందర్భంగా డిసెంబర్ 3న మీడియా సమావేశం నిర్వహించిన బిస్వజిత్ ఈ విషయాలను తెలిపారు. వైస్ అడ్మిరల్ బిస్వజిత్ తెలిపిన వివరాల ప్రకారం..
- విశాఖపట్నం తీరంలో తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో 2021 ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్, రాష్ట్రపతి నౌకాదళ పరిశీలన) జరుగుతుంది.
- 2021, ఫిబ్రవరి 25 తర్వాత 45 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, నౌకా దళాధికారులు, సిబ్బందితో మిలన్2021 విన్యాసాలు జరుగుతాయి.
- కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న 4 వేల మంది భారతీయులను నౌకాదళం సురక్షితంగా స్వదేశానికి తెచ్చింది.
నేవీ డే కథ..
బంగ్లాదేశ్ విమోచన అంశం ప్రధాన కారణంగా భారత్పాక్ మధ్య 1971 డిసెంబర్ 3న మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. ఈ యుద్ధంలో డిసెంబర్ 4 పాకిస్తాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచీ నౌకా స్థావరాన్ని భారత పశ్చిమ నౌకాదళం ఆపరేషన్ ట్రైడెంట్ పేరుతో నాశనం చేసింది. ఈ అద్భుత విజయానికి చిహ్నంగా ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
చదవండి: ఆర్మీ నూతన యూనిఫామ్‌ను ఏ డిజైన్‌లో రూపొందించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో విశాఖపట్నం కేంద్రంగా యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ పని చేస్తుంది.
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : తూర్పు నౌకాదళం(ఈఎన్‌సీ) చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్