Indian Army: ఆర్మీ నూతన యూనిఫామ్‌ను ఏ డిజైన్‌లో రూపొందించారు?
యుద్ధక్షేత్రాల్లో సైనిక బలగాలకు మరింత తేలికైన, మన్నికైన యూనిఫాం సిద్ధమైంది. 2022 ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నారని సంబంధిత వర్గాలు డిసెంబర్ 2న వెల్లడించాయి. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండే ఈ యూనిఫామ్‌ను ఆలివ్, మృణ్మయ రంగుల కలబోతగా ‘డిజిటల్ డిస్ట్రర్బ్’ డిజైన్‌లో రూపొందించారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్ కోసం ఎంపికచేశారు. 2022, జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు.
చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఎవరు ఉన్నారు?
భారత రక్షణ వ్యవస్థలో ఒకటయిన భారత సైనిక దళం (ఇండియన్ ఆర్మీ)లో మొత్తం సుమారు 25 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం సైనిక దళ ప్రధానాధికారి (చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్) జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఉన్నారు.
చదవండి: దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిజిటల్ డిస్ట్రర్బ్ డిజైన్‌లో ఆర్మీ యూనిఫాం రూపకల్పన
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : యుద్ధక్షేత్రాల్లోని సైనిక బలగాలకు... వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్