Skip to main content

National Logistics Policy 2022: దేశంలో నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం.. 5,000కు పైగా ‘స్కిల్‌ హబ్స్‌’

దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి 5,000కుపైగా ‘స్కిల్‌ హబ్స్‌’ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడమే యువతకు తారకమంత్రం కావాలని ఉద్బోధించారు.
PM launches National Logistics Policy
PM launches National Logistics Policy

ఆయన సెప్టెంబర్ 17న ఐటీఐ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. కనుక యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలి. వారి రంగాల్లో మార్పులను గమనిస్తూండాలి’’ అన్నారు. ‘‘మా హయాంలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా దాదాపు 5,000 ఐటీఐలను ప్రారంభించాం. 4 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి.  

Also read: Quiz of The Day (September 17, 2022): సీనియర్ సిటిజన్లకు అంకితమైన స్టార్టప్ గుడ్‌ఫెలోస్‌ను ఎవరు ఆవిష్కరించారు?

రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్‌ లాజిస్టిక్స్‌ పాలసీని మోదీ ఆవిష్కరించారు. ‘‘13–14 శాతమున్న రవాణా లాజిస్టిక్స్‌ వ్యయాన్ని 7.5 శాతం కంటే దిగువకు తేవడంతో పాటు సమయం, డబ్బు మరింతగా ఆదా అయ్యేలా చూడటమే దీని లక్ష్యం. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 17th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 19 Sep 2022 06:28PM

Photo Stories