Covid Cases In India: భారత్‌లో మళ్లీ కరోనా కల్లోలం..ఒక్కరోజులో 7 వేలకు పైగా కేసులు..
Sakshi Education
దేశంలో రోజువారీ కరోనా వైరస్ కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కాగా గత 24 గంటల్లో ఏకంగా 7 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం(ఏప్రిల్ 11) ఉదయం నుంచి బుధవారం(ఏప్రిల్ 12) ఉదయం వరకు 2,14,242 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,830 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,47,76,002కి చేరింది.
కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కు చేరింది. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,42,04,771 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,016కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 220.66 కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది.
Aam Aadmi Party: జాతీయ పార్టీగా ఆమ్ఆద్మీ.. హోదా కోల్పోయిన మూడు పార్టీలివే..
Published date : 12 Apr 2023 01:49PM