Skip to main content

PUC ఉంటేనే బంకుల్లో పెట్రోల్, డీజిల్‌

ఢిల్లీలోని వాహనదారులు డీజిల్, పెట్రోల్‌ కోసం పెట్రోల్‌ పంపుల్లో పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికేట్ (పీయూసీ) చూపించడం తప్పనిసరి.
No petrol, diesel without pollution check certificate
No petrol, diesel without pollution check certificate

అక్టోబర్ 25 నుంచి ఇది అమల్లోకి రానుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ చెప్పారు. పీయూసీ లేని వాహన యజమానులకు 6 నెలల వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందన్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం అవసరమైతే ఈ రెండు శిక్షలు అమలవుతాయని కూడా స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. నిబంధనలను వారంలో వెల్లడి చేస్తామన్నారు. 

Also read: క్యాన్సర్‌ కణితి పెరుగుదలను పర్యవేక్షించే పరిక‌రాన్ని ఎవ‌రు క‌నుగొన్నారు..?

‘ఢిల్లీలో కాలుష్యానికి వాహన ఉద్గారాలు కూడా ఒక కారణమే. ఢిల్లీ రవాణా శాఖ తాజా గణాంకాల ప్రకారం..13 లక్షల ద్విచక్ర వాహనాలు, 3 లక్షల కార్లు సహా మొత్తం 17 లక్షల వాహనాలకు పీయూసీ లేదు’అని మంత్రి చెప్పారు. ‘నో పీయూసీ, నో ఫ్యూయెల్‌’ కార్యక్రమం అమలుపై మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్‌తో అందిన పలు సలహాలు, సూచనలు అందాయి. వీటిపై తాజాగా పర్యావరణం, రవాణా, ట్రాఫిక్‌ విభాగాల అధికారులతో జరిగిన సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని రాయ్‌ అన్నారు. ఢిల్లీలో కాలుష్య నివారణకు తీసుకునే చర్యల అమలు కోసం అక్టోబర్ 3వ తేదీ నుంచి వార్‌ రూం పనిచేస్తుందని కూడా రాయ్‌ వెల్లడించారు.

Also read: European researchers: ఊదా రంగు టమాటాకు అమెరికా ఆమోదం

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Oct 2022 07:08PM

Photo Stories