Namo Bharat Rapid Rail: తొలి ‘నమో భారత్ ర్యాపిడ్’ రైలు ప్రారంభం.. ఇది ఎక్కడినుంచి తిరుగుతుందో తెలుసా?
దీంతోపాటు నాగ్‌పూర్–సికింద్రాబాద్, కొల్హాపూర్–పుణె, ఆగ్రాక్యాంట్–వారణాసి, దుర్గ్–విశాఖపట్నం, పుణె–హుబ్బళి, విశాఖపట్నం–రాయ్పూర్మధ్య నడిచే రైళ్లనూ మొదలుపెట్టారు. అలాగే.. అహ్మదాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో రూ.8,000 కోట్ల పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.
తొలి భారత్ మెట్రో పేరు మార్పు
మెట్రో నగరాల మధ్య తిరిగే దేశంలో తొలి మెట్రో ‘వందే మెట్రో’ పేరును ప్రారంభోత్సవానికి కొద్దిసేపటి ముందు కేంద్రం ‘నమో భారత్ ర్యాపిడ్ రైల్’గా మార్చింది. సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం ఈ రైలును మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది తొమ్మిది స్టేషన్లలో ఆగుతూ 359 కిలో మీటర్లు ప్రయాణించి అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు టికెట్ ధర రూ.455గా నిర్ణయించారు.
మరో మెట్రోలో ప్రధాని ప్రయాణం
అహ్మదాబాద్, గాంధీనగర్‌లను కలిపే రెండో దశ మెట్రోను మోదీ ప్రారంభించారు. అందులో గాంధీనగర్ సెక్టార్1 స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీకి వెళ్లారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కొందరు విద్యార్థులు ప్రయాణించారు. రూ.5,384 కోట్ల వ్యయంతో ఫేజ్2 పనులు చేపట్టారు.