Marital rape: అది అత్యాచారం కిందకు రాదు.. అలహాబాద్ హైకోర్టు
ఇందుకు సంబంధించి భర్తపై ఐపీసీ సెక్షన్ 377ను వర్తింప జేయడంపై గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే, ఇండిపెండెంట్ థాట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017)కేసులో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి వ్యక్తి, 15–18 మధ్య వయస్సున్న అతడి భార్య మధ్య జరిగే ఎలాంటి లైంగిక సంపర్కమైనా అత్యాచారం కిందికే వస్తుందని స్పష్టం చేసింది.
Articl 370: ఆర్టికల్ 370 రద్దును సమర్ధించిన సుప్రీంకోర్టు
ఓ వ్యక్తి వేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నెల 6న ఈ మేరకు పేర్కొంది. అయితే, పిటిషనర్‌పై కట్నం వేధింపులకు సంబంధించిన ఆరోపణలపై తమ తీర్పు ప్రభావం ఉండబోదని తెలిపింది. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిపై 2013లో ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 377తోపాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌లోని దిగువ కోర్టుతోపాటు, అప్పిల్లేట్ కోర్టు కూడా అతడిని దోషిగా పేర్కొన్నాయి. వీటిని సవాల్ చేస్తూ అతడు అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశాడు. విచారించిన హైకోర్టు.. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323 కింద నమోదైన కేసుల్లో దిగువ కోర్టులిచ్చిన తీర్పులను సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది.
Jammu and Kashmir Reservation Bill: జమ్మూ కశ్మీర్ బిల్లులను ఆమోదించిన లోక్‌సభ