Assembly Elections: నిరుద్యోగులకు రూ.3,000.. ఎక్కడో తెలుసా..?
Sakshi Education
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.3,000, డిప్లొమా చేసిన వారికి రూ.1,500 నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
![Indian National congress](/sites/default/files/images/2023/03/21/indian-national-congress-1679386620.jpg)
‘‘యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తాం. 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల ఖాళీలను భర్తీచేస్తాం’ అని హామీ ఇచ్చారు. మార్చి 20వ తేదీ బెళగావిలో ‘యువక్రాంతి’ బహిరంగ సభ ఆయన ప్రసంగించారు. గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళ ఇంటిపెద్దగా ఉన్న కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థికసాయం, దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతీ సభ్యుడికి నెలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ఇప్పటికే మూడు హామీలు ప్రకటించింది. నిరుద్యోగ భృతి నాలుగో హామీ ఇచ్చింది.
Ladli Behna Yojana: మహిళల కోసం ‘లాడ్లి బెహనా’ యోజన
Published date : 21 Mar 2023 01:47PM