Carbon Neutral Panchayat: దేశంలోనే తొలి కార్బన్ రహిత పంచాయతీ ఏది?
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం(ఏప్రిల్ 24) సందర్భంగా ఏప్రిల్ 24న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని పల్లి గ్రామాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఇక్కడ 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను ఆరంభించి జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోనే తొలి కార్బన్ రహిత(కార్బన్ న్యూట్రల్) పంచాయతీగా పల్లి గ్రామ పంచాయతీ చరిత్రకెక్కింది. ఈ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టులో భాగంగా 6,408 మీటర్ల ప్రాంతంలో 1,500 సోలార్ ప్యానెల్స్‌ను ఇన్‌స్టాల్ చేశారు. దీనివల్ల 340 గృహాలకు పర్యావరణ హితమైన విద్యుత్ లభిస్తుంది. గ్రామ్ ఊర్జా స్వరాజ్ ప్రోగ్రాం కింద రూ. 2.75 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు.
Sikhism: సిక్కుల తొమ్మిదో గురువు ఎవరు?
రూ. 20వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
పల్లి గ్రామం నుంచే దేశవ్యాప్తంగా గ్రామసభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశానికి కార్బన్ రహిత మార్గాన్ని పల్లి చూపుతుందని ఆయన చెప్పారు. స్థానిక ప్రజల సహకారంతోనే ఈ సోలార్ ప్రాజెక్టు సాకారమైందన్నారు. 370వ అధికరణ రద్దు తర్వాత ప్రధాని మోదీ కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. పల్లి గ్రామం నుంచే.. దాదాపు రూ. 20వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు వర్చువల్ విధానం ద్వారా మోదీ శంకుస్థాపన చేశారు. వీటిలో బనిహాల్– ఖాజీగుండ్ రోడ్ టన్నెల్ కూడా ఉంది. దీనివల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు.Noise Pollution: నివాస ప్రాంతాల్లో సీపీసీబీ అనుమతించిన శబ్ద కాలుష్య పరిమితి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి కార్బన్ రహిత(కార్బన్ న్యూట్రల్) పంచాయతీగా అవతరించిన గ్రామ పంచాయతీ
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : పల్లి గ్రామ పంచాయతీ
ఎక్కడ : పల్లి గ్రామ పంచాయతీ, సాంబా జిల్లా, జమ్మూ,కశ్మీర్
ఎందుకు : పల్లి గ్రామంలో.. 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను ఆరంభించిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్