Skip to main content

Intranasal Vaccine: కరోనా నాసికా టీకా ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

కరోనా నియంత్రణకు హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన నాసికా (నాసల్‌) టీకా ఇన్‌కొవాక్‌ను కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయా, జితేంద్ర సింగ్ జ‌న‌వ‌రి 26న‌ విడుదల చేశారు.

కరోనాకు ప్రపంచంలో తొలి నాసికా టీకా ఇదే. సూది అవసరం లేకుండా ముక్కు ద్వారా తీసుకోవడం దీని ప్రత్యేకత. కొన్ని షరతులతో దీని అత్యవసర వాడకానికి డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) 2022 నవంబర్‌లో అనుమతి లభించింది. 18 ఏళ్లు నిండినవారికి బూస్టర్‌ డోసుగా ఇవ్వొచ్చని సూచించింది. దీని ధర ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.800. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కు సరఫరా చేస్తామని సంస్థ గతంలో వెల్లడించింది. 

Nasal Vaccine: కోవిడ్ నాసికా టీకా ధ‌ర ఖ‌రారు

 

Published date : 27 Jan 2023 05:18PM

Photo Stories