Nasal Vaccine: కోవిడ్ నాసికా టీకా ధర ఖరారు
Sakshi Education
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ ధరను దాని తయారీదారు భారత్ బయోటెక్ డిసెంబర్ 27న ప్రకటించింది.
ప్రభుత్వ కోవిన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉండే ఈ నాసికా వ్యాక్సిన్‌ను రూ.800కు అందివ్వనున్నట్లు తెలిపింది. దీనికి పన్నులు అదనం. కాగా భారీ స్థాయిలో సేకరించి, పౌరులకు అందించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కు డోస్ చొప్పున (పన్నులు అదనం) విక్రయిస్తామని తెలిపింది. జనవరి నాలుగో వారంలో దీన్ని మార్కెట్లోకి విడుదలచేస్తారు.
BF.7 : కరోనా కొత్త వేరియంట్ ‘బీఎఫ్.7’.. ఈ వైరస్ సోకితే ఎలా గుర్తించాలంటే..?
Published date : 28 Dec 2022 03:05PM