Skip to main content

Population: జనాభాలో చైనాను దాటిన భార‌త్

ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భార‌త్‌ అవతరించింద‌ని వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (డబ్ల్యూపీఆర్‌) నివేదిక తెలిపింది.

గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా జ‌న‌వ‌రి 17న‌ అధికారికంగా ప్రకటించింది. అదే రోజున భారత్‌ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్‌ అంచనా వేసింది. జ‌న‌వ‌రి 18 నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్‌ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం జ‌న‌వ‌రి 18 నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు.

Covid Deaths: చైనాలో 35 రోజుల్లో.. 60 వేల కరోనా మరణాలు

1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా ఇప్ప‌టికే ప్రకటించింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు.  

Population: చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి

Published date : 19 Jan 2023 12:25PM

Photo Stories