Justice Ashok Cheema: ఎన్‌సీఎల్‌ఏటీ చైర్మన్‌గా జస్టిస్ చీమా కొనసాగొచ్చు: సుప్రీంకోర్టు
Sakshi Education
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌ఏటీ) చైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ ఇక్బాల్‌సింగ్ చీమాను గడువు కంటే ముందే పదవీ విరమణ చేయించడంపై తలెత్తిన వివాదానికి తెరపడింది.
2021, సెప్టెంబర్ 20వ తేదీ దాకా పదవిలో కొనసాగుతూ తీర్పులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జస్టిస్ చీమా ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌గా 2021, సెప్టెంబర్ 20న పదవీ విమరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పదవిలో జస్టిస్ ఎం.వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం సెప్టెంబర్ 11వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్ చీమా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సెప్టెంబర్ 17న తీర్పు వెల్లడించింది.
Published date : 17 Sep 2021 03:18PM