Shiv Sena: రూ.2,000 కోట్లతో పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కొనుగోలు!
Sakshi Education
శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ కొనుగోలు వెనుక ఇప్పటిదాకా రూ.2,000 కోట్ల డీల్ చోటుచేసుకుందని ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు.
‘‘ఇది 100 శాతం నిజం. మహారాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితుడైన ఓ బిల్డర్ నాకీ విషయం చెప్పాడు’’ అంటూ ఫిబ్రవరి 19న ట్వీట్ చేశారు. డీల్‌కు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలో బయటపెడతానని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు గతంలో ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.
రూ.2,000 కోట్లు అంటే చిన్న మొత్తమేమీ కాదని తెలిపారు. రౌత్ ఆరోపణలను సీఎం ఏక్‌నాథ్ షిండ్ వర్గం నాయకుడు సదా సర్వాంకర్ ఖండించారు. సంజయ్ రౌత్ క్యాషియరా? అని ప్రశ్నించారు. ఆధారాల్లేని ఆరోపణలు చేయొద్దని, స్వతంత్ర సంస్థలైన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీయొచ్చని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత సుధీర్ మునగంటివార్ హితవు పలికారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)
Published date : 20 Feb 2023 12:41PM