Skip to main content

Covid-19: కోర్బివాక్స్‌ టీకాను తయారు చేసిన సంస్థ?

Corbevax Vaccine

దేశవ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. హైదరాబాద్‌లోని బయోలాజికల్‌ ఈ. లిమిటెడ్‌ సంస్థ తయారు చేసిన ‘‘కోర్బివాక్స్‌’’ టీకా ఇవ్వనున్నట్లు మార్చి 14న తెలిపారు. 12, 13, 14 ఏళ్ల వయసున్న వారు మార్చి 16వ తేదీ నుంచి కరోనా టీకా తీసుకోవాలని కోరారు. అలాగే రెండు కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతూ 60 ఏళ్లు దాటిన వారు కూడా బూస్టర్‌ డోసు వేయించుకోవచ్చని సూచించారు.

7.11 కోట్ల మంది..
12–14 ఏళ్ల వయసు విభాగంలో దేశవ్యాప్తంగా 7.11 కోట్ల మంది పిల్లలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. బయోలాజికల్‌ ఈ.లిమిటెడ్‌ సంస్థ 5 కోట్ల కోర్బివాక్స్‌ టీకా డోసులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. దేశంలో 14 ఏళ్లు దాటిన వారికి కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ను గతంలోనే ప్రారంభించిన సంగతి తెలిసిందే. 15–18 ఏళ్ల వారికి 2022, జనవరి 3వ తేదీ నుంచి కరోనా టీకాలు ఇస్తున్నారు.

Reliance Industries: దేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ఎక్కడ ప్రారంభమైంది?

చైనాకు స్టెల్త్‌ ఒమిక్రాన్‌ దడ
చైనా ప్రభుత్వానికి స్టెల్త్‌ ఒమిక్రాన్‌ (ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌) దడ పుట్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో చైనాలో 1,337 కొత్త కేసులు నిర్థారణ కాగా ఇందులో ఒక్క జిలిన్‌ ప్రావిన్స్‌లోనివే 895 వరకు ఉన్నాయి. దీంతో ఈశాన్యప్రాంతంలో ఉన్న జిలిన్‌ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలెవరూ కారణం లేకుండా ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. అసలు కరోనా వైరస్‌ కన్నా, ఇతర వేరియంట్ల కన్నా స్టెల్త్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

Yamuna River: నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా డైరెక్టర్‌గా ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌(కోర్బివాక్స్‌ టీకా) మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఎప్పుడు : మార్చి 14
ఎవరు    : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
ఎక్కడ     : దేశవ్యాప్తంగా..
ఎందుకు : కోవిడ్‌ వైరస్‌ నియంత్రణ కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Mar 2022 04:24PM

Photo Stories