Skip to main content

Judicial Conference: హైకోర్టు సీజేల న్యాయ సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు?

Law

దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సుకు రంగం సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత 2022, మే 30న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఈ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు కొనసాగనుంది. సమావేశంలో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలను ఏకీకృతం చేసేందుకు ఉమ్మడి కార్యాచరణను తీసుకొచ్చే దిశగా జరిగే ప్రయత్నాలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ, సీజేఐ ఎన్‌వీ రమణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు ప్రసంగిస్తారు.

Human Skeletons: పంజాబ్‌ బావిలోని పుర్రెలు ఏ ప్రాంత ప్రజలవని తేలింది?

దేశంలోని న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు నేషనల్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఏర్పాటు చేయాలని సీజేఐ రమణ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.

2016 ఏప్రిల్‌ 24న చివరిసారిగా..
సీఎం, సీజేల సదస్సు సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సు తొలిసారిగా 1992లో అప్పటి ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు, జస్టిస్‌(రిటైర్డ్‌) మధుకర్‌ హీరాలాల్‌ కనియా సీజేఐగా ఉన్నపుడు జరిగింది. 2016 ఏప్రిల్‌ 24న చివరిసారిగా   సదస్సు జరిగింది. ఇందులో సబార్డినేట్‌ కోర్టుల మౌలిక సదుపాయాలు, నేషనల్‌ మిషన్‌ ఫర్‌     జ్యుడీషియల్, సెలవు రోజుల్లో కోర్టుల పనితీరు, ట్రయల్‌ ఖైదీలకు సంబంధించిన ప్రత్యేక సూచనలతో జైళ్ల పరిస్థితులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అమలు, న్యాయ–సహాయ కార్యక్రమాల బలోపేతం, హైకోర్టుల్లో ఖాళీల భర్తీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు.​​​​​​​​​​​​​​GK Awards Quiz: 'ఏ నేషన్ టు ప్రొటెక్ట్' పుస్తక రచయిత?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
2022, మే 30న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల çసంయుక్త సదస్సు నిర్వహణ
ఎప్పుడు    : ఏప్రిల్‌ 28 
ఎక్కడ    : విజ్ఞాన్‌ భవన్, న్యూ ఢిల్లీ
ఎందుకు : దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించే దిశగా జరిగే ప్రయత్నాల సమర్థ సమన్వయం కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 29 Apr 2022 06:40PM

Photo Stories