Rs.75 Coin: రూ.75 నాణెం విడుదల.. ఈ నాణెం బరువు ఎంతంటే..?
Sakshi Education
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవమైన మే 28న కేంద్ర ప్రభుత్వం రూ.75 నాణేన్ని విడుదల చేయనుంది.

ఆర్థిక శాఖలోని ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నాణెం బరువు 34.65–35.35 గ్రాములు ఉంటుంది. నాణేనికి ఒక వైపు అశోకుడి స్థూపం నాలుగు సింహాలతో పాటు దేవనాగరి లిపిలో భారత్, ఆంగ్లభాషలో ఇండియా అన్న అక్షరాలు ఉంటాయి. రెండో వైపు పార్లమెంటు కొత్త భవనాన్ని ముద్రించారు.
Published date : 27 May 2023 11:36AM