7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్... రెండేళ్లపాటు వేతనంతో కూడిన సెలవులు
ఈ కొత్త సవరణ ప్రకారం ఇప్పుడు ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరావుల పాటు సెలవులు తీసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1995 ప్రకారం సవరించిన చైల్డ్ కేర్ లీవ్ నియమాలను నోటిఫై చేసింది. దీని ప్రకారం రెండు సంవత్సరాలు సెలవులు తీసుకున్నప్పటికీ వేతనాలు అందుతాయి. అంటే సెలవుల్లో ఉన్నప్పటికీ జీతం లభిస్తుంది.
ఇవీ చదవండి: డెంటల్ అడ్మిషన్లు కోసం... మొదటి దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS)లోని ఒక మహిళ లేదా పురుషుడు తమ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి వారి మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవు తీసుకోవచ్చు. వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు లోపు విద్య, అనారోగ్యం, సంరక్షణ వంటి వాటి కోసం సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: నీట్‌లో అదరగొడుతున్న గురుకుల విద్యార్థులు.. 185 మందికి ఎంబీబీఎస్ సీట్లు
చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఉద్యోగి సెలవులు తీసుకుంటే మొదటి సంవత్సరం (మొదటి 365 రోజులలో) 100 శాతం జీతం లభిస్తుంది, ఆ తరువాత ఏడాదిలో 80 శాతం వేతనం లభిస్తుంది. అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 స్పెల్‌ల కంటే ఎక్కువ కాలం చైల్డ్ కేర్ లీవ్ లభించదు. కానీ సర్వీస్‌లో ఉన్న ఒంటరి మహిళకు సంవత్సరంలో 6 స్పెల్‌ల వరకు లీవ్ లభిస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద తీసుకునే సెలవులు ఇతర లీవ్స్‌లో కలిపే అవకాశం లేదు. దీనికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది.