All Women Maritime Surveillance Mission: అండమాన్ & నికోబార్ కమాండ్ చారిత్రాత్మక మహిళా సముద్ర నిఘా మిషన్
ఈ గొప్ప ఘట్టం లింగ సమానత్వానికి భారతదేశం నిబద్ధతను చెబుతుంది. దీంతో పాటు దేశ రక్షణలో మహిళలు పోషించే అనివార్య పాత్రను గుర్తిస్తుంది.
ఐఎన్ఎస్ ఉత్క్రోష్ నుండి నిర్వహించబడిన ఈ మిషన్‌లో ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ఒక అత్యుత్తమ బృందం పాల్గొంది.
1. లెఫ్టినెంట్ కమాండర్ శుభాంగి స్వరూప్
2. లెఫ్టినెంట్ కమాండర్ దివ్య శర్మ
3. లెఫ్టినెంట్ వైశాలి మిశ్రా
1984 మార్చి 8న ప్రారంభించబడిన ఐఎన్ఏఎస్ (INAS) 318, నిఘా కార్యకలాపాలలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. మొదట ఐల్యాండర్ విమానాలతో సన్నద్ధమైన ఈ స్క్వాడ్రన్, 1999లో డోర్నియర్ విమానాలతో భర్తీ చేయబడింది, ఇవి మెరుగైన నిఘా సామర్థ్యాల కోసం అధునాతన మెరైన్ పెట్రోల్ రాడార్‌లతో అమర్చబడ్డాయి.
Sudha Murthy: రాజ్యసభకు సుధామూర్తి.. ఆమె తీసుకున్న అవార్డులు ఇవే..
ఈ మిషన్ కీలక అంశాలు ఇవే..
మిషన్: అండమాన్ & నికోబార్ కమాండ్ ద్వారా మొట్టమొదటి మహిళా సముద్ర నిఘా మిషన్.
తేదీ: 2024 మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, INAS 318 యొక్క 40వ వార్షికోత్సవం సందర్భంగా..
స్థానం: ఐఎన్ఎస్ (INS) ఉత్క్రోష్ .
సిబ్బంది: ముగ్గురు మహిళా అధికారులు - లెఫ్టినెంట్ సీడీఆర్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ సీడీఆర్ దివ్య శర్మ, లెఫ్టినెంట్ వైశాలి మిశ్రా
ప్రాముఖ్యత: లింగ సమానత్వం కోసం భారతదేశం యొక్క నిబద్ధతను మరియు దేశ రక్షణలో మహిళల పాత్రను గుర్తిస్తుంది.