World Health Day: మనం తినే ఆహారమే ఔషధం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా 1950 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తున్న వివిధ అనారోగ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతీ ఏటా ఏప్రిల్ 7న ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. అప్పటి నుంచి డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశాలు, సిబ్బంది నుంచి వచ్చిన సమర్పణల ఆధారంగా, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కోసం ఒక కొత్త అంశం (థీమ్) ఎంచుకోవడం జరుగుతోంది. ప్రజలందరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి, ప్రశాంతమైన, సంపన్నమైన, స్థిరమైన వాతావరణంలో సంతోషకరమైన జీవితాలను గడపాలని ‘అందరికీ ఆరోగ్యం(Health For All)’ 2023 సంవత్సరం థీమ్‌గా తీసుకున్నారు.
Babu Jagjivan Ram: బాబూ జగ్జీవన్‌రామ్.. సమతావాది.. సంస్కరణవాది..
ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించేది ఆహారమే అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనం తినే ఆహారమే ఔషధం.. ఎందుకంటే అందులోనే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. రోజూ సరైన, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవు. చికిత్స కంటే నివారణ మేలు అని గ్రహించి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. అందుకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తినాలంటే..
తాజా పండ్లు, కూరగాయలు..
సీజన్‌ను బట్టి లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పాలకూర, మెంతికూర, కాలే వంటి ఆకు కూరలు. అరటిపండ్లు, నారింజ, ఆపిల్, బెర్రీ ఫ్రూట్స్, ద్రాక్ష వంటి పండ్లను తినాలి.
National Vaccination Day 2023: ఆరోగ్యానికి వరం టీకా ఔషధం..
తృణధాన్యాలు..
కేవలం అన్నం మాత్రమే తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అన్నంతో పాటు ప్రతిరోజూ ప్రోటీన్లు, ఫైబర్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉండే తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవాలి. అంటే గోధుమలు, వోట్స్, బ్రౌన్ రైస్ లాంటి శక్తినిచ్చే వాటిని తీసుకోవాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్ బి, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మీ మెరుగైన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.
మాంసకృత్తులు..
మాంసకృత్తులు మీ శరీర పెరుగుదలకు, కణజాలాల నిర్మాణానికి అవసరం. కాబట్టి మీ ఆహారంలో చికెన్, మటన్, చేపలు, బీన్స్ వంటివి ఉండేలా చూసుకోండి. వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
గింజలు, విత్తనాలు..
చియా గింజలు, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు మొదలైనవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన పోషకాలు కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం, సెలీనియం వంటివి ఉంటాయి. వీటిని సరైన పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి.
ఆరోగ్యకరమైన కొవ్వులు..
ఆలివ్ ఆయిల్, అవకాడో, సాల్మన్ వంటి కొవ్వు చేపలలో లభించే కొవ్వులను ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణిస్తారు. వీటన్నింటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ప్రతిరోజూ సరిపడా నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, తగినంతగా నిద్రపోవడం వంటివి మరింత ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.