China Pneumonia: చైనాలో కొత్త వైరస్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన
చైనాలోని చిన్నారుల్లో ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల పిల్లలో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఊపరితిత్తుతుల ఇన్‌ఫెక్షన్, జ్వరం వంటివి వ్యాపిస్తుండటంతో బీజింగ్, లియోనింగ్ నగరాల్లోని ఆసుపత్రులు బాధిత చిన్నారులతో కిక్కిరిసిపోతున్నాయి.
Mysterious Pneumonia in China: చైనాలో కరోనా మాదిరి మిస్టీరియస్ న్యూమోనియా కలకలం
తాజాగా ఈ కొత్త వైరస్‌పై హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందకూరి స్పందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం పిల్లలో నమోదవుతున్న న్యూమోనియయా కేసుల్లో కొత్త వైరల్ ఏది లేదని తెలిపారు. దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. టీకాలు తీసుకోవడం, మాస్క్‌లు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపారు. పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల, న్యుమోనియా కేసులపై ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ చైనా నుంచి వివరణాత్మక వివరణ కోరిందని చెప్పారు.
ఉత్తర చైనాలో నమోదవుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2)తో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా డైరెక్టర్ అజయ్ శుక్లా హెచ్చరించారు. శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైతే ఇతర వ్యక్తులకు కాస్త దూరంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని అధికారులు చెబుతున్నప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేశారు.
డాక్టర్ శుక్లా మాట్లాడుతూ.. పిల్లలు పాఠశాలకు వెళుతున్నట్లయితే, వారికి దగ్గు, జలుబు, జ్వరం లేదా ఇతర లక్షణాలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. తరగతి గదిలో పిల్లలెవరికైనా న్యుమోనియా ఉంటే ఉపాధ్యాయుడికి తెలియజేయండి. పిల్లలు అనారోగ్యంతో ఉంటే పాఠశాలకు పంపవద్దు." అని పేర్కొన్నారు.
New Covid variant Pirola: కొత్త రూపాలలో కరోనా వైరస్
చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ గురించి పూర్తి స్థాయిలో ఖచ్చితమైన వివరాలు లేవని తెలిపిన డాక్టర్ శుక్లా.. డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అటు.. చైనాలో శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులకు వెళ్లే చిన్న పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొన్ని కేంద్రాలలో దాదాపు 1200 మంది పిల్లలు పెరిగినట్లు వారు నివేదించారు.
ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరల్ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్‌లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు.. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ (హెచ్9ఎన్2) కేసులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏవియన్ వైరస్ కేసుల వల్ల భారత్‌కు ఎలాంంటి రిస్క్ లేదని తెలిపింది. ఎలాంటి ఆరోగ్య అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంది.
Global TB Report 2023: అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలో నమోదు