Surrogacy Leave for Six Months : సరోగసీతో పిల్లలను పొందినా 6 నెలల సెలవులు..
Sakshi Education
అద్దె గర్భం(సరోగసీ) ద్వారా సంతానాన్ని పొందిన ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఇకపై 180 రోజులపాటు మాతృత్వ సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్1972లో సవరణలు చేసింది. సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే.. ఆమెకూ ప్రసూతి సెలవులు లభిస్తాయి. సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన తండ్రి (కమిషనింగ్ ఫాదర్) కూడా బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల్లో 15 రోజులు పితృత్వ సెలవులు పొందేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
Published date : 03 Jul 2024 03:41PM