Global TB Report 2023: అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలో నమోదు
2022లో భారత దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ నివేదికలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో 27 శాతం ఇండియాలోనే ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 28.2 లక్షల కేసులు ఉన్నాయని.. దాంట్లో 12 శాతం అంటే 3.42 లక్షల మంది ఆ వ్యాధికి బలైనట్లు రిపోర్టులో తెలిపారు.
UNESCO creative cities: యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం– 30 దేశాల్లో 87 శాతం టీబీ కేసులు ఉన్నట్లు తేలింది. భారత్ తర్వాత అత్యధిక టీబీ కేసులు ఉన్న దేశాల్లో ఇండోనేషియా (10 శాతం), చైనా(7.1 శాతం),పిలిప్పీన్స్ (7 శాతం), పాకిస్థాన్ (5.7 శాతం), నైజీరియా (4.5 శాతం), బంగ్లాదేశ్ (3.6 శాతం), కాంగో (3 శాతం) ఉన్నాయి. భారత్‌లో క్షయవ్యాధి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. 2015లో ప్రతి లక్ష మందిలో 258 మంది క్షయ వ్యాధిగ్రస్తులు ఉండేవారు, 2022 నాటి ఆ సంఖ్య 199కి పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది. కానీ ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువే ఉన్నట్లు తెలిసింది.
National Policy on Menstrual Hygiene: ఋతుస్రావంపై సుప్రీమ్ కోర్ట్ కీలక ఆదేశాలు