Skip to main content

UNESCO creative cities: యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్‌

‘యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ’ (యూసీసీఎన్‌) జాబితాలో.. మన దేశంలోని గ్వాలియర్‌(మధ్యప్రదేశ్‌), కోజికోడ్‌ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది.
Heritage Conservation Gwalior, Traditional Handicrafts Kozhikode, Digital Innovation in Arts Kozhikode, Gwalior, Kozhikode join UNESCO's list of creative cities, Historic Architecture in Gwalior,

అభివృద్ధి విధానాల్లో సంస్కృతి, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తున్నందుకు, ప్రజలు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేస్తున్నందుకు వీటిని గుర్తించినట్లు యునెస్కో తెలిపింది. అక్టోబరు 31న ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. సంగీత విభాగంలో గ్వాలియర్, సాహిత్యంలో కోజికోడ్‌ ఈ జాబితాలో చోటు పొందాయి. కొత్తవాటితో కలిపి యూసీసీఎన్‌ జాబితాలో 100 దేశాలకు చెందిన 350 నగరాలు ఉన్నట్లయింది.

QS Asia University Rankings: క్యూఎస్‌ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఇండియా టాప్‌

Published date : 10 Nov 2023 10:03AM

Photo Stories