Skip to main content

Marburg Virus: మరో కొత్త వైరస్ వ్యాప్తి.. 10 మంది మృతి.. లక్షణాలివే..!

క‌రోనా మహమ్మారి కనుమరుగవుతుందన్న‌ తరుణంలో మరో వైరస్ ముప్పు ప్రపంచానికి పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Marburg virus

ప్ర‌స్తుతం ఆఫ్రికా దేశంలోని ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ కొత్తరకం ఎబోలా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ప్రమాదకరమైన ఈ వైరస్‌లోనూ ఎబోలా లక్షణాలుంటాయని పేర్కొంది. వైరస్ నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను గినియాకు పంపినట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

ల‌క్ష‌ణాలివే..
ఈ వైరస్ సోకినవారికి జ్వరంతో పాటు తరచుగా రక్తస్రావం జరుగుతుంది, శరీర సామర్థ్యం తగ్గిపోతుంది, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే, వైరస్ సోకినవారితో ప్రత్యక్ష సంబంధం, సన్నహితంగా మెలిగినా లేదా శరీర ద్రవాలు ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను అరికట్టే టీకాలు లేదా చికిత్సలు అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ, ప్రాణాపాయం నుంచి కాపాడే పలు విధానాలను ఉపయోగిస్తున్నారు. ఇమ్యూన్ థెరపీలు, ఔషధాలు, బ్లడ్ ప్రోడక్ట్స్, అలాగే క్లినికల్ దశలో ఉన్న వ్యాక్సిన్‌లతో చికిత్సలు కొనసాగిస్తుననారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

రక్తస్రావ జ్వరం అనుమానిత కేసులు
ప్రాణాంతకమైన ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందిన ప్రావిన్సులను క్వారంటైన్ చేశామని ఈక్వటోరియల్ గినియా ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలోని దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో రక్తస్రావ జ్వరం అనుమానిత కేసులు వెలుగుచూసినట్లు వారం రోజుల కింద‌నే అక్క‌డి ప్రభుత్వం ప్రకటించింది. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్సు పొరుగు జిల్లా మొంగోమోలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మితోహా ఒండో అయేకాబా పేర్కొన్నారు. 
కీ-ఎన్‌టెమ్‌లో ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ 4,325 మంది ప్రభావితమయ్యారని, జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య 9 మంది మరణించారన్నారు. వీరి రక్త నమూనాల్లో మార్‌బర్గ్ వైరస్ నిర్ధారణ అయ్యింది. కాగా ఆఫ్రికాలో గతంలో ప్రబలిన ఎబోలాతో చాలా మంది మరణించారు. ఎబోలా కొత్త రూపం మార్‌బర్గ్ ప్రబలుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ హైఅలర్ట్ ప్రకటించింది. వైరస్ నియంత్రణ కోసం అంటువ్యాధి, కేస్ మేనేజ్‌మెంంట్, నియంత్రణ, ల్యాబొరేటరీ, రిస్క్ కమ్యూనికేషన్ నిపుణులను గినియాకు పంపినట్టు పేర్కొంది.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)

ఎబోలా వైరస్ కుటుంబానికి చెందిన‌..
వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్‌(WHO) ప్రకారం.. మార్బర్గ్ వైరస్ మరణాల నిష్పత్తి 88 శాతం వరకు ఉంటుంది. ఇది ఎబోలా వైరస్ వ్యాధికి కారణమయ్యే వైరస్ కుటుంబానికి చెందింది. మార్‌బర్గ్ వైరస్ బారినపడ్డ వారిలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, తీవ్రమైన అనారోగ్యంతో అకస్మాత్తుగా ప్రారంభమతాయి. చాలా మంది రోగులు ఏడు రోజులలో తీవ్రమైన రక్తస్రావ లక్షణాలు వెలుగుచూస్తాయి. 

Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టే పక్షులు, జంతువులు!

Published date : 15 Feb 2023 11:38AM

Photo Stories