New COVID Variant: మరో కరోనా వేవ్.. ఈ దేశంలో పెరుగుతున్న కేసులు..
తాజాగా జపాన్‌లో మరోసారి కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఇవి అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్-19కు చెందిన 11వ వేవ్ ఇప్పుడు జపాన్‌ను వణికిస్తోంది.
కొత్త వేరియంట్ కారణం ఇదే..
కేపీ.3 వేరియంట్ జపాన్‌లో వేగంగా విస్తరిస్తోంది. టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది. ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారీ మరింత ప్రమాదకరంగా మారుతోంది. కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులలో కోవిడ్-19 బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు.
కేపీ వేరియంట్ త్రీ సాధారణ లక్షణాలు అధిక జ్వరం, గొంతు నొప్పి, వాసన, రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట. జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ అంతటా జూలై 1 నుంచి 7వ తేదీ వరకు వివిధ ఆసుపత్రులలో రోజుకు సగటున 30 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య సదుపాయాలు, పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది.
Malaria Vaccine: ఈ దేశంలో అందుబాటులోకి వచ్చిన మలేరియా వ్యాక్సిన్
Tags
- new COVID variant
- KP 3
- Disease Control and Prevention
- COVID-19
- kp 3 varien
- Covid-19 cases
- Fever
- Sore Throat
- Sakshi Education Updates
- JapanCOVID19
- COVID19Variant
- JapanCoronavirus
- 11thWaveCOVID19
- JapaneseHealthExperts
- COVID19Resurgence
- JapanPandemic
- COVID19Alert
- internationalnews
- SakshiEducationUpdates