Earthquake: భూకంపాన్ని ముందే పసిగట్టే పక్షులు, జంతువులు!
ప్రకృతి విపత్తులు వచ్చే సమయంలో జంతువు, పక్షుల ప్రవర్తనను క్షుణ్ణంగా గమనిస్తే ఏదో జరుగుతుందని మనం ఊహించవచ్చు.. విపత్తులు వచ్చే సమయంలో వాటి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మన చుట్టూ ఉండే జంతువులు, పక్షులు అలాంటి సందర్భాల్లో ఎప్పటి కంటే కాస్త భిన్నంగా ప్రవర్తిస్తాయి.
భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక కోసం సెన్సార్ల అభివృద్ధికి పక్షుల అనాటమీ మరియు ఫిజియాలజీని అధ్యయనం చేయడం (ఆర్నిథాలజీ) మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన భారీ భూకంపంలో దాదాపు 35 వేల మందికి పైగా చనిపోయారు. అయితే ఈ పెను విధ్వంసానికి 20 గంటల ముందుగానే అక్కడి పక్షులు, జంతువులు వింతగా ప్రవర్తించాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో సంభవించిన భూకంపాలను కనీసం కొన్ని గంటల ముందే అంచనా వేయడానికి సెన్సార్‌లను అభివృద్ధి చేయగలిగేలా పక్షి/జంతువుల ప్రవర్తన నుంచి మనం కొంత నేర్చుకోవచ్చని పిళ్లే చైర్ ప్రొఫెసర్, ఐఐటి ఢిల్లీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి రాంగోపాల్ రావు అంటున్నారు.
Current Affairs (Persons) Bitbank: టాటా ట్రస్ట్‌ల కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు?
సమస్య ఏమిటంటే.. భూకంపాలు సాపేక్షంగా అరుదైన సంఘటనలు, కాబట్టి భూకంపాలకు ముందు పక్షి/జంతువుల ప్రవర్తన గురించి గణాంకపరంగా తీర్మానాలు చేయడానికి తగిన నమూనాను సేకరించడం కష్టంగా మారింది. అయితే భూకంపాల కారణంగా విద్యుదయస్కాంత వైవిధ్యాలు గమనించబడ్డాయి, కానీ అటువంటి వైవిధ్యాలను పూర్వగాములుగా ఉపయోగించడానికి తగిన డేటా లేదు. అత్యాధునిక సాంకేతికత సాయంతో చాలా ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించడం కష్టం. ఉదాహరణకు భూకంపాల సమయంలో, భూకంప సెన్సర్లు భూమి నిజంగా కుదుపులకు గురైనప్పుడు మాత్రమే కదులుతాయి. కానీ మనం భూకంపం గురించి నమ్మకంగా అంచనా వేయడానికి ముందస్తు సంకేతాలు అవసరం అమవుతాయి. తీవ్ర భూకంపాలు వచ్చే ముందు స్థిరమైన సంకేతాలు ఇచ్చేలా శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలను కనుగొనలేదు. అందుకే అవి వచ్చే ముందు జంతువుల ప్రవర్తన లాంటివాటిని హెచ్చరిక వ్యవస్థలను పరిగణించాలని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Syria Earthquake: శిథిలాల కిందే చిన్నారికి జననం... కన్నబిడ్డను కనులారా చూడకుండానే...!
రాబోయే ప్రకృతి వైపరీత్యాల గురించి జంతువు, పక్షుల్లో అంతర్లీనంగా ఒక హెచ్చరించే వ్యవస్థ ఉండవచ్చని శాస్తవేత్తలు బావించి ఇటీవల పావురాలు తమ ఇంటి దారిని కనుగొనడానికి అయస్కాంతత్వాన్ని ఉపయోగిస్తాయని ఓ ఆవిష్కరణలో తెలిపారు. పావురాల ముక్కుపై అయస్కాంతత్వాన్ని కలిగి ఒక చిన్న ప్రదేశం ఉంటుందని తెలిపారు. ఇది పక్షులకు భూమి యొక్క ధ్రువాలకు సంబంధించి దాని స్థానం గురించి సమాచారాన్ని అందించే జిపిఎస్(GPS) యూనిట్‌గా పనిచేస్తుందన్నారు. పక్షుల కళ్ళలో కూడా అయస్కాంత క్షేత్రాలను చూడడానికి సహాయపడే కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో సంబవించిన ప్రకృతి ప్రకోపాన్ని పక్షులు ముందుగానే గుర్తించాయి. భూకంపం సంభవించడానికి కొన్ని గంటల ముందు పక్షులు వింతగా ప్రవర్తించినట్లు మనకు ఓ వీడియో ద్వారా తెలుస్తోంది.
China Spy Balloon: చైనా ‘స్పై బెలూన్’ను కూల్చేసిన అమెరికా!
🚨In Turkey, strange behavior was observed in birds just before the earthquake.👀#Turkey #TurkeyEarthquake #Turkish pic.twitter.com/yPnQRaSCRq
— OsintTV📺 (@OsintTV) February 6, 2023