Skip to main content

US Supreme Court: ఇక‌పై ఆ యూనివ‌ర్సిటీల్లో రిజ‌ర్వేష‌న్లు చెల్ల‌వు.... సుప్రీం కీల‌క తీర్పు

అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక‌పై ఆ యూనివ‌ర్సిటీల్లో రిజ‌ర్వేష‌న్లు చెల్ల‌వు.... సుప్రీం కీల‌క తీర్పు
ఇక‌పై ఆ యూనివ‌ర్సిటీల్లో రిజ‌ర్వేష‌న్లు చెల్ల‌వు.... సుప్రీం కీల‌క తీర్పు

ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్‌ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.  

ఇంజినీరింగ్ నుంచి ఐపీఎస్ అధికారిగా.. రెండో ప్ర‌య‌త్నంలోనే ఐపీఎస్ ఎలా సాధించిందంటే...

👨‍⚖️ ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌  ఆ సంచలన తీర్పు చదువుతూ..  ఒక స్టూడెంట్‌ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 

usa

👨‍⚖️ అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్‌ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 

👨‍⚖️ ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 

Group 4: గ్రూప్ 4 ప‌రీక్ష‌లో ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి... లాస్ట్ మినిట్ టిప్స్ మీకోసం

👨‍⚖️ అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 

👨‍⚖️ అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్‌ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్‌ సుప్రీం ముందు వాదించింది. 

👨‍⚖️ నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 

👨‍⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది.  

Infosys: వర్క్‌ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్ కీలక నిర్ణ‌యం... కంపెనీ సీఈఓ ఏమంటున్నారంటే....

usa

ట్రంప్‌ తప్పా అంతా ఆగ్రహం
యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. 

MBBS students: కేర‌ళ‌లోనూ హిజాబ్ వివాదం.. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి హిజాబ్‌తో అనుమ‌తించాలంటూ ఆందోళ‌న‌

రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే  ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ‍్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని  అంటున్నారాయన. 

MBBS : వైద్య విద్యార్థుల‌కు కీల‌క అప్డేట్‌... ఈ ఎగ్జామ్ పూర్తి చేసిన‌వారికే లైసెన్స్‌

ట్రంప్‌ మాత్రం ఇలా...
ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్‌సోషల్‌లో పోస్ట్‌ చేశారాయన.

Published date : 30 Jun 2023 03:26PM

Photo Stories