United Nations: ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి ప్రసంగించిన నేత?
రష్యా సైన్యం తమ దేశంలో అత్యంత హేయమైన యుద్ధనేరాలకు పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఉద్దేశించి ఏప్రిల్ 5న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బుచాలో రష్యా దళాలు చేయని నేరం లేదని, దీనిపై విచారణ జరపాలని, ఇంతటి ఘోరాలకు ఆదేశాలిచ్చిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. బుచాలో రక్తమోడుతూ, కాలి బుగ్గిగా మారి కన్పించిన శవాల కుప్పలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.
Russia-Ukraine War: స్టార్‌స్ట్రీక్ మిసైల్‌ను ఏ దేశంలో తయారు చేశారు?
తీవ్రంగా ఖండిస్తున్నాం: భారత్
ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో పౌరులపై జరిగిన దారుణ హత్యాకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్టు భారత్ ప్రకటించింది. దీనిపై అంతర్జాతీయ విచారణ జరగాలన్న డిమాండ్‌కు మద్దతు తెలిపింది. దౌత్యమే సమస్యకు పరిష్కారమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పునరుద్ఘాటించారు.
బ్లింకెన్‌తో జై శంకర్ చర్చలు
ఉక్రెయిన్ పరిణామాలపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ ఏప్రిల్ 5న ఫోన్ చర్చలు జరిపారు. పలు ద్వైపాక్షిక అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు.
Spying: ఏ దేశ దౌత్యవేత్తలను బెల్జియం, నెదర్లాండ్స్ బహిష్కరించాయి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్