Spying: ఏ దేశ దౌత్యవేత్తలను బెల్జియం, నెదర్లాండ్స్ బహిష్కరించాయి?
గూఢచర్యం ఆరోపణలపై రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు బెల్జియం, నెదర్లాండ్స్ మార్చి 29న ప్రకటించాయి. 21 మంది రష్యా దౌత్యవేత్తలను రెండు వారాల్లోగా దేశం వీడాలని బెల్జియం ఆదేశించింది. నెదర్లాండ్స్ కూడా 17 మంది రష్యా దౌత్యాధికారులను బహిష్కరిస్తున్నట్టు పేర్కొంది. వీరంతా నిజానికి నిఘా అధికారులని ఆరోపించింది.
నెదర్లాండ్స్..
రాజధాని: ఆమ్‌స్టర్‌డామ్; కరెన్సీ: యూరో
బెల్జియం..
రాజధాని: బ్రస్సెల్స్; కరెన్సీ: యూరో
ఐరాస హెలికాప్టర్ కూల్చివేత
కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్‌ను వేర్పాటువాదులు కూల్చేశారు. మార్చి 28న కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్ గ్రూప్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం ప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
Unintended Pregnancy: వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్‌ను విడుదల చేసిన సంస్థ?
ఒంటరి మహిళలకు విమానంలోకి నో ఎంట్రీ
అఫ్గానిస్తాన్‌లో మహిళలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. మగ తోడు లేకుండా వారు ఒంటరిగా విమానాల్లో ప్రయాణించడానికి వీల్లేదని తాలిబన్లు తాజాగా హుకుం జారీ చేశారు. మార్చి 25న కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒంటరి మహిళలను విమానమెక్కేందుకు అనుమతించలేదు.
UNEP Report: ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి నగరం?
దివయినా వార్తా పత్రిక దేశానికి చెందినది?
శ్రీలంక విదేశీమారక నిల్వలు అత్యంత కనిష్ట స్థాయిలకు దిగజారుతున్నాయి. కనీసం వార్తా పత్రికల ప్రచురణకు న్యూస్ ప్రింట్ కూడా కొనలేని దుస్థితి! దాంతో రెండు ప్రధాన పత్రికలు ది ఐలాండ్ (ఇంగ్లిష్), దివయినా (సింహళీ) ప్రచురణను నిలిపేశాయి. ఐలాండ్ ఈ–పేపర్‌కు పరిమితమైంది. దేశంలో నిత్యావసరాల ధరలు కూడా చుక్కలంటుతున్నాయి. లంకకు బిలియన్ డాలర్ల సాయానికి భారత్ ముందుకొచ్చింది.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్