Russia-Ukraine War: స్టార్‌స్ట్రీక్ మిసైల్‌ను ఏ దేశంలో తయారు చేశారు?
ఇంగ్లండ్‌లో తయారైన స్టార్‌స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యాకి చెందిన ఎంఐ–28ఎన్ హెలికాప్టర్‌ను లుహాన్స్‌క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూల్చేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా కనీసం 143 యుద్ధవిమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులు, 316 సైనిక వాహనాలను కోల్పోయినట్టు సమాచారం. ఇప్పటిదాకా 18 వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ఉక్రెయిన్ చెప్తోంది.
Political Crisis in Pakistan: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
100 శాతం కచ్చితత్వంతో..
ద్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది. ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్‌స్ట్రీక్ ప్రయోగంపై రష్యా మండిపడింది.
మహారాష్ట్రలో చైనా రాకెట్ శకలాలు..
నాగపూర్: అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించి, భారత గగనతలంలో పేలిపోయిన చైనా రాకెట్ ‘‘చాంగ్ జెంగ్ 5బీ’’ శకలాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేవాహీ తాలూకాలోని రెండు గ్రామాల్లో లభ్యమయ్యాయి. ఇవి లోహపు రింగు, సిలిండర్ ఆకారంలో ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఏప్రిల్ 2న చైనా రాకెట్ శకలాలు పడుతున్న దృశ్యాలు కనిపించాయి.
Spying: ఏ దేశ దౌత్యవేత్తలను బెల్జియం, నెదర్లాండ్స్ బహిష్కరించాయి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్