Political Crisis in Pakistan: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరిగింది. దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకునేందుకు ఏప్రిల్ 3న జరిగిన జాతీయ అసెంబ్లీ కీలక సమావేశం అనూహ్య పరిణామాలకు వేదికైంది. స్పీకర్ అసద్ ఖైజర్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చన్న అనుమానంతో సమావేశం మొదలవగానే విపక్షాలు ఆయనపై అవిశ్వాస నోటీసు కూడా ఇచ్చాయి. దాంతో సమావేశానికి అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ ఖాసిం ఖాన్ సూరి, తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే సభను వాయిదా వేశారు. అనంతరం దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిసిన ఇమ్రాన్.. జాతీయ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. అందుకు ఆయన ఆమోదముద్ర వేశారు.
Spying: ఏ దేశ దౌత్యవేత్తలను బెల్జియం, నెదర్లాండ్స్ బహిష్కరించాయి?
పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానీ పూర్తికాలం పాటు పదవిలో కొనసాగలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్‌లో 2023 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇమ్రాన్ 2018 ఆగస్టు 18న దేశ 22వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
సుప్రీం విచారణ
డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ విపక్షాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఏప్రిల్ 3న ప్రత్యేకంగా సమావేశమైంది. మొత్తం ఉదంతంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. జాతీయ అసెంబ్లీ రద్దు విషయంలో అధ్యక్షుడు, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ తదితరులకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది.
Unintended Pregnancy: వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్‌ను విడుదల చేసిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ
ఎందుకు : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫార్సుల మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్