Unintended Pregnancy: వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్‌ను విడుదల చేసిన సంస్థ?
ప్రపంచవ్యాప్తంగా ఏటా దాలుస్తున్న గర్భాల్లో దాదాపు సగం వరకు అంటే..12.1 కోట్ల గర్భాలు అవాంఛితాలేనని ఐక్యరాజ్యసమితికి చెందిన పాపులేషన్ ఫండ్(యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్) తెలిపింది. తీవ్రమైన ఈ సమస్యను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పేర్కొంది. ఈ మేరకు మార్చి 30న వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్–2022 విడుదల చేసింది.
UNEP Report: ప్రపంచంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న మొదటి నగరం?
నివేదికలోని ముఖ్యాంశాలు..
- అవాంఛిత గర్భం దాల్చిన వారిలో 60 శాతం వరకు అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇందులో సుమారు 45 శాతం సురక్షితం కాని అబార్షన్లు కాగా, అబార్షన్ల సమయంలో 5 శాతం –13 శాతం వరకు మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
- 1990–2019 మధ్య 15–49 ఏళ్ల గ్రూపులో ప్రతి వెయ్యి మంది మహిళల్లో అవాంఛిత గర్భాలు 79 నుంచి 64కు తగ్గటం కొంత ఊరట కలిగించే విషయం. అయితే, గత 30 ఏళ్లలో అవాంఛిత గర్భం దాల్చిన మహిళల సంఖ్య 13 శాతం మేర పెరిగింది. జనాభా పెరుగుదలే ఇందుకు కారణం
- ప్రపంచవ్యాప్తంగా 25.7 కోట్ల మంది గర్భం వద్దనుకునే మహిళలు సురక్షితమైన, ఆధునిక గర్భ నిరోధక సాధనాలను వాడటం లేదు
- మొత్తంగా 47 దేశాలకు చెందిన లైంగిక చర్యలో చురుకుగా పాల్గొనే మహిళల్లో 40 శాతం మంది ఎలాంటి గర్భనిరోధక పద్ధతులను పాటించడం లేదు
- సంతాన సామర్థ్యం ఉన్న 64 దేశాల్లోని మహిళలపై చేపట్టిన సర్వేలో..23 శాతం మంది సెక్స్‌కు అభ్యంతరం చెప్పలేకపోతున్నారు.
- తమ ఆరోగ్యం గురించి 24 శాతం మంది, గర్భనిరోధకాల వాడకం విషయంలో 8 శాతం మంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
- మొత్తమ్మీద 57 శాతం మంది మహిళలు మాత్రమే తమ లైంగిక, సంతాన సంబంధ విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు.
Russia-Ukraine War: అమెరికా, ఈయూ మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పంద ఉద్దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్