Military Budget: రక్షణ వ్యయంలో రెండో స్థానంలో ఉన్న దేశం ఏది?
ప్రపంచదేశాలు సైనికపరంగా చేస్తున్న వ్యయం మొట్టమొదటిసారిగా ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లను(2 లక్షల కోట్ల డాలర్లు) మించిపోయింది. స్వీడన్‌కు చెందిన సంస్థ స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి–ఎస్‌ఐపీఆర్‌ఐ) ఈ మేరకు వెల్లడించింది. ఎస్‌ఐపీఆర్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం..
GK Economy Quiz: భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ఉన్నది?
- సైనికపరంగా చేస్తున్న ఖర్చులో అమెరికా, చైనా, భారత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- 2021లో ప్రపంచ సైనిక వ్యయం 0.7 శాతం పెరిగి 2,113 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో 62 శాతం వాటా అమెరికా, చైనా, భారత్, యూకే, రష్యాలదే. అమెరికా, చైనా వాటాయే ఏకంగా 52 శాతం.
- 2021లో అమెరికా 801 బిలియన్ డాలర్లు, చైనా 293 బిలియన్ డాలర్లు, భారత్ 76.6 బిలియన్ డాలర్లు రక్షణపై వెచ్చించాయి.
- ఆసియా–ఓసియానియా ప్రాంత దేశాల సైనిక వ్యయం 586 బిలియన్ డాలర్లు. ఇందులో భారత్–చైనాల వాటాయే ఏకంగా 63 శాతం. అయితే ఇది 2020 కంటే 1.4 శాతం తక్కువ.
Economic Crisis: ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సైనికపరంగా చేస్తున్న ఖర్చులో అమెరికా, చైనా, భారత్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి–ఎస్‌ఐపీఆర్‌ఐ)
ఎక్కడ : ప్రపంచంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్