Skip to main content

G-20 : భారత్‌ నాయకత్వం.. G-20 లోగో, థీమ్, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ..

న్యూఢిల్లీ:  అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న పెద్ద దేశాలతో కూడిన గ్రూప్‌–20(జి–20)కి నాయకత్వం వహించనుండడం భారత్‌కు గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు.
PM Modi unveils logo, theme, website of G20 presidency
PM Modi unveils logo, theme, website of G20 presidency

75వ స్వాతంత్య్ర దినోత్సవాల వేళ ఇది మనకు దక్కిన గొప్ప అవకాశామని అన్నారు. జి–20కి భారత నాయకత్వానికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను మోదీ ఆవిష్కరించారు. 20 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతో కూడిన ఈ గ్రూప్‌నకు ప్రస్తుతం ఇండోనేషియా నాయకత్వం వహిస్తోంది.

Also read: Weekly Current Affairs (National) Bitbank: 3వ ప్రపంచ కూచిపూడి నాట్యోత్సవం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి నాయకత్వ బాధ్యతలను భారత్‌ స్వీకరించనుంది. దేశ అభివృద్ధి ప్రయాణాన్ని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వాలు, ప్రజలు తమ వంతు పాత్ర పోషించారని చెప్పారు. ప్రజాస్వామ్యం అనేది ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంటే సంఘర్షణలకు తావు ఉండదన్న నిజాన్ని భారత్‌ ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. దేశ సౌభాగ్యానికి అభివృద్ధి, పర్యావరణం (ప్రగతి, ప్రకృతి) కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. జి–20కి నేతృత్వం వహించే అవకాశం లభించడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. లోగో, థీమ్, వెబ్‌సైట్‌ మన ప్రాధాన్యతలను, సందేశాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, నవంబర్ 7th కరెంట్‌ అఫైర్స్‌

15, 16న బాలీలో శిఖరాగ్ర సదస్సు  
జి–20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జి–20 శిఖరాగ్ర సదస్సు ఇండోనేషియాలోని బాలీలో ఈ నెల 15, 16వ తేదీల్లో జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 09 Nov 2022 02:26PM

Photo Stories