New island in Japan: జపాన్‌లోని సముద్రంలో కొత్త ద్వీపం
Sakshi Education
జపాన్‌లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది.. ఓ కొత్త ద్వీపం (ఐలాండ్) ఏర్పడింది.
అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. ఐవో జిమా దక్షిణ కోస్తా తీరానికి కిలోమీటరు దూరంలో అక్టోబరు 21న అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని, అనంతరం పదిరోజుల్లోనే బూడిద, రాళ్లు పేరుకొని 100 మీటర్ల వ్యాసంతో.. సముద్ర మట్టానికి 20 మీటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
Nineteen Volcanos Erupt at the Same Time: ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం
Published date : 23 Nov 2023 06:20PM