Skip to main content

AUKUS: ఆకస్‌ కూటమిలోకి జపాన్..

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ (AUKUS) కూటమి దక్షిణ చైనా సముద్రంలో చైనా కట్టడిని మరింత పటిష్టం చేయడానికి కీలకమైన చర్యలు చేపట్టబోతోంది.
Japan in talks to join AUKUS defence pact

తమ కూటమిలోకి జపాన్‌ను కూడా తీసుకోవాలని ఈ మిత్రదేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తైవాన్‌పై చైనా దాడి చేసే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నారు.

ఆస్ట్రేలియా నౌకాదళానికి అణు జలాంతర్గాముల తయారీ ఒప్పందమైన ఆకస్‌ను విస్తరించి జపాన్‌ను కూడా భాగస్వామ్యం చేసుకునేందుకు త్వరలోనే చర్చలు ప్రారంభం కానున్నాయని సమాచారం. ఈ అంశంపై అమెరికా కూడా ఆసక్తి కనబరుస్తోంది. ఈ కూటమి కృత్రిమ మేధస్సు, డ్రోన్లు, డీప్‌స్పేస్ రాడార్ల సాయంతో చైనాపై నిరంతర నిఘా ఉంచే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది.

ఆకస్‌ కూటమిలోని రక్షణ మంత్రులు ఈ విషయంపై చర్చించడానికి ఏప్రిల్ 8వ తేదీ భేటీ కానున్నారు. అయితే, ఈ కూటమి ఏర్పాటుపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రాంతీయంగా ఆయుధ పోటీని పెంచుతుందని చైనా ఆరోపించింది.

NATO: సమిష్టి రక్షణకు 75 వసంతాలు పూర్తి చేసుకున్న NATO

➢ AUKUS కూటమిలో జపాన్‌ను చేర్చేందుకు చర్చలు ప్రారంభం కానున్నాయి.
➢ ఈ చర్య దక్షిణ చైనా సముద్రంలో చైనా కట్టడిని పటిష్టం చేస్తుంది.
➢ చైనా ఈ కూటమి ఏర్పాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

Published date : 08 Apr 2024 06:46PM

Photo Stories