Skip to main content

International Criminal Court: యుద్ధ నేరం అంటే ఏమిటి? ఐసీసీ ఏం చేస్తుంది?

ఇజ్రాయెల్- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. తొలుత హమాస్.. ఇజ్రాయెల్‌పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది.
Countries unite at Geneva Conference for peace and law, International Criminal Court, Geneva Conference, Historic moments at the Geneva Conference on law of war
International Criminal Court

దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకూ 1,300 మంది పౌరులు మరణించగా, గాజా స్ట్రిప్‌లో భారీ విధ్వంసం జరిగింది. 

Israel-Palestine war: ఇజ్రాయెల్‌ పాలస్తీనాల‌ మధ్య భీకర యుద్ధం

హమాస్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో యుద్ధ నేరాలకు సంబంధించిన పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం మొదలుకొని యుద్ధ నేరాలలో న్యాయానికి సంబంధించిన సవాళ్లు ఎదురవుతున్నాయి. 1949లో జరిగిన జెనీవా సమావేశం యుద్ధ నేరాలపై చర్చించింది. అప్పుడు యుద్ధంలో అనుసరించాల్సిన నియమాలను రూపొందించారు.  అంతర్జాతీయ యుద్ధ నేరాల ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయాలను ప్రతి దేశం ఆమోదించింది. 

Is Israel-Hamas War Impact On Global Economy: ఇజ్రాయెల్, హమాస్‌ల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడనుందా?

జెనీవా సమావేశంలో సాయుధ పోరాట చట్టం, మానవతా చట్టాలకు సంబంధించిన విధానాల రూపకల్పనను పలు దేశాలు అంగీకరించాయి. యుద్ధ సమయంలో సైన్యం ప్రవర్తన, యుద్ధ ఖైదీల చికిత్సకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించారు. ఈ చట్టాలు హమాస్ ఉగ్రవాదులతో సహా వివిధ దేశాలు, అన్ని వ్యవస్థీకృత సాయుధ సమూహాలకు వర్తిస్తాయి. 

హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోని చిన్నారులు, వృద్ధులు, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అలాగే ఇ‍జ్రాయెల్‌ కూడా హమాస్‌పై ఎదురుదాడికి దిగి తీవ్ర నష్టం కలిగించింది. ఈ నేపధ్యంలో హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఈ దేశాలపై అభియోగాలను నమోదు చేస్తుంది. దేశీయ న్యాయస్థానాలు తమ అధికార పరిధిలోని యుద్ధ నేరాల కేసుల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాయి. ఏదైనా దేశంలోని పౌరులకు వ్యతిరేకంగా యుద్ధ నేరాలు చోటుచేసుకున్నప్పుడు, బాధిత దేశం చట్టాలను అమలు చేయలేని పరిస్థితులు ఏ‍ర్పడినప్పుడు ఐసీసీ ఇటువంటి వివాదాల్లో జోక్యం చేసుకుని పరిష్కరిస్తుంది. 

India–Israel relations: భారతదేశ‌ రైతులకు ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధం ఏమిటి?

Published date : 19 Oct 2023 10:25AM

Photo Stories