Skip to main content

Comprehensive Trade Pact: భారత్, బంగ్లాదేశ్ కుదుర్చుకున్న కొత్త ఒప్పందాలు ఇవే..

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా జూన్ 22వ తేదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
India, Bangladesh Agree to Start Talks on Comprehensive Trade Pact   India and Bangladesh signed 10 new agreements

ఈ సమావేశంలో రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, రక్షణ సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చించాయి.
➤ భారత్, బంగ్లాదేశ్ 10 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో డిజిటల్, సముద్రయానం, రైల్వే, అంతరిక్షం, ఆరోగ్యం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుతాయి.
➤ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలు ప్రారంభించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.
➤ తీస్తా నది పరిరక్షణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు భారతదేశం టెక్నికల్ టీమ్‌ను పంపుతుంది.
➤ ఇండో-పసిఫిక్ కార్యక్రమంలో చేరాలనే బంగ్లాదేశ్ నిర్ణయాన్ని భారతదేశం స్వాగతిస్తుంది.
➤ బంగ్లా పౌరులకు వైద్య సేవల కోసం ఈ-మెడికల్ వీసాలను భారతదేశం ప్రారంభిస్తుంది.
➤ 1996 గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి చర్చలు ప్రారంభమవుతాయి.

G7 Summit 2024: జీ-7 దేశాల సమ్మిట్.. జ‌రిగింది ఎక్క‌డంటే..

Published date : 29 Jun 2024 09:53AM

Photo Stories