UN Security Council: భద్రతామండలి ప్రెసిడెంట్‌గా భారత్
Sakshi Education
ఐక్యరాజ్యసమితిలోని శక్తివంతమైన భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.
15 దేశాల మండలిలో డిసెంబర్ నెలకు గాను అధ్యక్ష పీఠంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ కొనసాగుతారు. ప్రెసిడెన్సీ సమయంలో చేపట్టాల్సిన ప్రాధాన్యాంశాలపై ఆమె ఇప్పటికే ఐరాస సెక్రటరీ గుటెరస్, జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కసాబా కరోసితో చర్చలు జరిపారు. 2021 ఆగస్ట్ నెలలో కూడా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహించింది. మండలిలో భారత్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది.
Published date : 02 Dec 2022 02:40PM