UN Peacebuilding Commission: ఐరాస శాంతి పరిరక్షక కమిషన్‌కి తిరిగి ఎంపికైన భారత్
Sakshi Education
2025-26 సంవత్సరానికి గాను ఐక్యరాజ్యసమితి శాంతి నిర్మాణ కమిషన్(పీబీసీ)కి భారత్ తిరిగి ఎన్నికైంది.
ప్రస్తుతం ఈ కమిషన్లో భారత్ సభ్యత్వం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనుంది. ఐరాస వ్యవస్థాపక సభ్యదేశాల్లో ఒకటైన భారత్ ఐరాస శాంతి పరిరక్షక దళాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. పీబీసీకి 2025-2026 కాలానికి గాను మరోసారి ఎన్నికైంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కట్టుబడి ఉంటుంది' అని ఐరాసలో భారత్ శాశ్వత మిషన్ 'ఎక్స్'లో పేర్కొంది.
సంఘర్షణలు నెలకొన్న దేశాల్లో శాంతినెలకొల్పే ప్రయత్నాలకు పీసీబీ సలహా మండలిగా వ్యవహరిస్తుంది. సర్వప్రతినిధి సభ, భద్రతా మండలి, ఆర్ధిక, సమాజిక మండలి నుంచి ఎన్నికయ్యే 31 దేశాల సభ్యులు ఇందులో ఉంటారు. ఐరాస శాంతి పరిరక్షకదళంలో అత్యధికంగా భార తీకు చెందిన 6 వేల మంది సైనిక, పోలీసు విభాగాల సిబ్బంది వివిధ దేశాల్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు.
Anti-Air Missiles: ఉత్తర కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
Published date : 30 Nov 2024 01:19PM