Donald Trump: ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్ ఖాతా.. ఎలాన్ మస్క్ ప్రకటన
మెజారిటీ జనం సానుకూలత వ్యక్తం చేశారని, అందుకే ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 2021 జనవరిలో ట్విట్టర్ నుంచి ట్రంప్‌ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ వద్ద డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు విధ్వంసానికి పాల్పడ్డారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ గెలిచినట్లు అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్) ప్రకటించేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణం. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే అప్పటి ట్విట్టర్ యాజమాన్యం ట్రంప్ ఖాతాను రద్దు చేసింది. ‘‘ప్రజలు ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. ఆయన ఖాతాను పునరుద్ధరించాం’’ అంటూ ఎలాన్ మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో ట్రంప్‌నకు స్వల్ప మెజారిటీ లభించినట్లు వెల్లడించారు. ఇందులో మొత్తం 1,50,85,458 ఓట్లు పోలయ్యాయి. 51.8 శాతం మంది ట్రంప్‌నకు మద్దతుగా, 48.2 శాతం మంది వ్యతిరేకంగా ఓటువేశారు.
➤Donald Trump : అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ ట్రంప్..!