Donald Trump : అమెరికా అధ్యక్ష బరిలో మళ్లీ ట్రంప్..!
Sakshi Education
2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేయనున్నట్లు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నవంబర్ 15న ప్రకటించారు.
డెమొక్రాట్ల నాయకుడు బైడెన్ నేతృత్వంలో అమెరికా పతనావస్థలోకి దిగజారిందని, దేశాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు మళ్లీ అధ్యక్షుడిగా వస్తానన్నారు. ‘‘గ్రేట్ అమెరికా కోసం మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నా. మీ గొంతుకగా ఉంటా. బైడెన్ మళ్లీ ప్రెసిడెంట్ కాలేరు! ఆయన హయాంలో అన్నీ వైఫల్యాలే. అసలైన అభివృద్ధిని నేను చేసి చూపిస్తా. అందుకే వస్తున్నా. నేను సిద్ధం. మీరూ సిద్ధమేగా!’’ అని ఫ్లోరిడాలోని మార్–ఏ–లాగో ఎస్టేట్‌లో నవంబర్ 15న మంగళవారం దాదాపు 400 మంది అతిథుల సమక్షంలో తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. 2016లో హిల్లరీ క్లింటన్‌ను ఓడించి అధ్యక్షుడయ్యాక నాలుగేళ్లు తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
Published date : 17 Nov 2022 03:46PM