Air India: ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా.. కారణం ఇదే..
అంతేకాకుండా, ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్‌కు రూ.6 లక్షలు, ట్రైనింగ్ డైరెక్టర్‌కు రూ.3 లక్షల జరిమానా విధించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్‌లను హెచ్చరించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
జూలై 9వ తేదీ ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముంబై నుంచి రియాద్‌కు విమానాన్ని నడపాల్సి సమయంలో ఓ ట్రైనింగ్ కెప్టెన్‌తో కలిసి ట్రైనీ పైలట్ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ ట్రైనింగ్ కెప్టెన్ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల, విమానాన్ని ట్రైనీ పైలట్ నడిపారు.
ట్రైనీ పైలట్ శిక్షణ కెప్టెన్‌తో ముంబై-రియాద్ విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, శిక్షణ కెప్టెన్ అనారోగ్యం పాలయ్యాడు మరియు అతని స్థానంలో శిక్షణ లేని కెప్టెన్‌ని నియమించారు. నిర్వహణ వ్యవస్థలోని లోపాల కారణంగా ఈ సంఘటన జరిగింది. జూలై 10న ఎయిర్‌లైన్ సమర్పించిన నివేదిక ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Electric Airliner: త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ విమానం..